ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గోదావరిఖని ప్రెస్ క్లబ్ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్ క్లబ్ ఆడిటోరియం లో కోల్ బెల్ట్ ప్రాంత సీనియర్ జర్నలిస్ట్,కామ్రేడ్ మునీర్ సంస్మరణ సభ నిర్వహించారు.తొలిత పలువురు ప్రముఖులు జర్నలిస్టులు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో కార్మిక సంఘాల నాయకులు,పలువురు సీనియర్ జర్నలిస్టులు,వక్తలు,విప్లవవామ పక్ష పార్టీలు నాయకులు,కోల్ బెల్ట్ ప్రాంతంలో మందమర్రి కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అమరుడు మునీర్ తో ఉన్న అనుబంధాలను ఆత్మీయతను ఆయన రాసిన వార్త కథనాలను నిర్బంధంలో పోలీసులతో ఎదుర్కొన్న సవాళ్ల ను జర్నలిస్టులను నక్సలైట్ గా ముద్ర వేసిన పోలీసులు ఒక దశలో మునీర్ ను ఎన్కౌంటర్ చేసే పరిస్థితులలో ఈ ప్రాంత జర్నలిస్టులు అందరూ ఏకమై ఆందోళన నిర్వహించి హోమ్ మినిస్టర్ కు విన్నవించి మునీర్ ను కాపాడుకున్నా జ్ఞాపకాలను గుర్తులను స్మరించుకుంటూ మాట్లాడారు.సీనియర్ జర్నలిస్టు గా ఎన్నో కష్టానష్టాలను ఓర్చుకొని కలమే గలంగా సింగరేణి కార్మికుల కష్టాలను కన్నీళ్లను వార్తా కథనాలు రాసి ఈ ప్రాంతంలో అందరితో విడదీయరాని స్నేహబంధం ఏర్పరచుకున్న మునీర్ మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆత్మీయతను పలువురు పంచుకున్నారు. మునీర్ కోసం ఒక అమర స్తూపాన్ని విగ్రహాన్నినెలకొల్పాలని ఆయన రాసిన న్యూస్ ఆర్టికల్ ఒక గొప్ప బుక్ లెట్ రూపంలో తీసుకొచ్చేందుకు కమిటీ ద్వారా ముందుకు వచ్చి నెరవేర్చాలని నిర్ణయించారు.మునీర్ సోదరుడు న్యాయవాది సందాని తన సోదరుడి కోసం ఎన్ని కష్టాలు పడ్డారో కన్నీటి పర్యంతమౌతు సంస్మరణ సభలో ఆవేదనతో మాట్లాడారు.ఈ సంస్మరణ సభలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్,ప్రధాన కార్యదర్శి పందిళ్ళ శ్యామ్,సీనియర్ జర్నలిస్ట్ మల్లోజుల వంశీ,బిజెపి నాయకులు ఎస్ కుమార్, కాంగ్రెస్ నాయకులు దిటి బాలరాజు, కార్మిక సంఘం నాయకులు రామ్మూర్తి, ఏఐటియుసి నాయకులు కవ్వంపల్లి స్వామి, గోవర్ధన్, కన్నం లక్ష్మీనారాయణ, మిరియాల రాజిరెడ్డి,కే మల్లయ్య, రియాజ్ అహ్మద్,రాజిరెడ్డి, కే విశ్వనాథ్, రమేష్,మహిళా నాయకురాలు మహేశ్వరి, ప్రజానాట్యమండలి కళాకారులు దయా నర్సింగ్ బృందం మునీర్ పై పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సిరిమల్లె మధు, పాత్రికేయులు,వివిధ పార్టీల నాయకులు,పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.