Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులు వృత్తి విలువలు పాటించాలి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర కాప్రా

జర్నలిస్టులు వృత్తి విలువలు పాటించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కోరారు.కాప్రా ప్రెస్ క్లబ్ మదర్ కమిటీ నూతన కమిటీ బాధ్యతలు స్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్థంభంగా పనిచేస్తూ ప్రజలకు నిజాయితీతో కూడిన సమాచారాన్ని అందించడం ఎంతో బాధ్యతతో కూడిన పని అని అన్నారు. జర్నలిస్టులు నిర్భయంగా నిజాలను వెలికితీసి సమాజానికి చూపిస్తున్నారని, వారి కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆరోగ్య భద్రత, బీమా సౌకర్యాలు, గృహ స్థలాల కేటాయింపు వంటి అంశాల్లో జర్నలిస్టులకు మరింత సహాయం అందించేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టులు బాధ్యతాయుతంగా పనిచే స్తూ పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కథనాలను అందించాలని, అప్పుడే సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో జర్నలిస్టులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాప్రా ప్రెస్ క్లబ్ మదర్ కమిటీ అధ్యక్షులు జ్యోతిర్మయ చారి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తాము ముందుండి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే కోశాధికారి వెంకట్ రెడ్డి తోపాటు కాప్రా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు, లైన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.