ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహిస్తున్న హెల్త్ వీక్ డే–4 గురువారం హెచ్ఐవి, ఎయిడ్స్ పై రెడ్ రిబ్బన్ అవగాహన ర్యాలీని పట్టణంలో మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి రవి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జగదేవ్‌పూర్ చౌరస్తా వరకు నినాదాలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరు ఎయిడ్స్ వ్యాధిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. హెచ్ఐవి వైరస్ శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వంశీ కృష్ణ, విజయ్ పటేల్, ప్రీతీ స్వరూప్, సాగరిక, డేవిడ్ , శైలజ పాల్గొన్నారు.