ముద్ర,రాయికల్: మాదకద్రవ్యాల నివారణ అవగాహన వారోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు రాయికల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రగతి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఈ సందర్భంగా రాయికల్ ఎస్సై సుధీర్ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రగతి పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ పాల్గొని, విద్యార్థులకు మొక్కల విలువను వివరించారు. మొక్కలు మన భవిష్యత్తుకు ఆధారస్తంభాలు కాబట్టి ప్రతి విద్యార్థి తాను నాటి మొక్కను సంరక్షించాలనే బాధ్యత తీసుకోవాలి అని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, పోలీస్ అధికారులు,విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మనోజ్, ప్రగతి హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ బాలె నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.