- అధికార పార్టీ నాయకులకు ఇందిరమ్మ ఇండ్లు.
ముద్ర ప్రతినిధి, భూపాలపల్లి: పేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. అర్హులైన వారికి కాకుండా అధికార పార్టీ వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయని ఆరోపణలు వస్తున్నా ఆ ఇంటి నిర్మాణాలు బేస్‌మెంట్ స్థాయిలోనే ఉన్నాయి. ఫైలట్ గ్రామంగా ఎంపికైనా లబ్ధిదారులకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది.సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో 40-60 గజాల ఇంటిస్థలంలోనే కట్టుకోవాలి.. ఆ ఇంటికి మెట్లు ఉండోద్దు.. రెండు గదులే ఉండాలి అని అధికారుల నిబంధనలను అనుసరించే ఇంటి నిర్మాణాలు నిర్మించుకోవాలని నింబధనలు పెట్టడంతో లబ్ధిధారులకు ఇబ్బందులు ఎదురైతున్నాయి.
అర్హులైన పేదలకు తమకు ఇండ్లు లేవని రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి గ్రామస్తులు దరఖాస్తు చేసుకోగా కేవలం 17 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. అవికూడా అధికార పార్టీ నాయకులకు రావడం పై గ్రామస్తులు ఆగ్రహం వెక్తం చేస్తున్నారు.మిగిలిన వారికి రెండో విఢతలో వస్తాయని అధికారులు నమ్మబలికినా మొదటగా మంజూరైన లబ్ధిదారులకే పలు ఇబ్బందులు ఎదురైతున్నాయని వాపోతున్నారు.మంజూరైనవారిలో నలుగురు మాత్రమే ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు.
- పూరి గుడిసెలో ఉన్నవారికి దక్కని ఇందిరమ్మ ఇండ్లు.
రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి గ్రామంలో పూరిగుడిసెలో ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి సర్కారులో అసలైన అర్హులకు అందని ద్రాక్షగానే ఇందిరమ్మ ఇండ్లు మిగిలిపోయాయి. రూపిరెడ్డి పల్లి గ్రామంలో చాలా వరకు గుడిసెలు లేని పూరిగూడిసేలో ఉంటున్న.కొంత మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకంటే పెంకుటింట్లో ఉన్న వారికి, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని తాము పూరిగుడిసెలో బతుకుతున్న తనకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని వాపోయారు.అధికారులను అడిగితే రెండోవిడతలో వస్తదని చెబుతున్నారని ఇంకెప్పుడు వస్తుందో అని ఇందిరమ్మ ఇంటి కోసం వారు ఎదురు చూస్తున్నారు.తమ లాంటి వారికి సర్కారును నుంచి సాయమందిస్తే బాగుంటుందని వారు అన్నారు.
