- జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతు సంక్షేమ ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు.జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి మండలం కీచులాటపల్లిలో సోమవారం సాయంత్రం మంత్రి సీతక్క 20 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్ తో కలిసి మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని పేర్కొన్నారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నదని తెలిపారు.రైతులకు మద్దతు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.సన్నరకం వరి ధాన్యాన్ని ప్రోత్సహించేందుకు 500 రూపాయల బోనస్ ఎకరాకు రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు.అంతకుముందు కీచులాటపల్లిలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పలువురు అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
