- 108 అంబులెన్స్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి
ముద్ర,వీపనగండ్ల : ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా పాలన లక్ష్యమని, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సిహెచ్ ఆసుపత్రికి మంజూరైన 108 అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా 25 లక్షల రూపాయలు మంజూరు కాగా సిమెంట్ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ, కస్తూర్బా పాఠశాలలో మెయింటెనెన్స్ పనులకు 15 లక్షల రూపాయలు మంజూరు కాగా అట్టి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు భూమి పూజ నిర్వహించారు. సిహెచ్సి ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి వైద్యం సదుపాయాలు అందుతున్నాయి, ఎంతమంది వైద్యులు, సిబ్బంది ఉన్నారని వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో తగినంత సిబ్బంది లేరని కేవలం ముగ్గురు వైద్యులు మాత్రమే డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి స్థాయిలో వైద్యులను సిబ్బంది నియమించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు, విద్యార్థులు చదువును కష్టంగా భావించకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రతిరోజు విద్యార్థులకు ప్రార్థన సమయంలో మహనీయుల చరిత్రను వివరించాలని దీనితో విద్యార్థులకు ధైర్యము, సాహసము, పట్టుదల పెరగడమే కాక నిరాశ నిస్ప్రొహలకు లోను కాకుండా ఉంటారని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు భోజనం చేయడానికి కావాల్సిన డైనింగ్ హాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని డైనింగ్ హాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని పాఠశాల ఎస్ఓ అరుణ మంత్రి జూపాలి దృష్టికి తీసుకొచ్చారు. డైనింగ్ హాల్ నిర్మాణం కోసం కూడా త్వరలో నిధులు మంజూరు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, వైద్య అధికారులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ వంశీకృష్ణ,డాక్టర్ రాజశేఖర్,ఉమ్మడి జిల్లా 108 అంబులెన్స్ కోఆర్డినేటర్ రవికుమార్, వనపర్తి 108 అంబులెన్స్ జిల్లా కోఆర్డినేటర్ రత్నం కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఇంద్రకంటి వెంకటేష్, పానగల్ సింగల్ విండో మాజీ అధ్యక్షులు బాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, సుదర్శన్ రెడ్డి, చక్ర వెంకటేష్, గోపాల్ నాయక్,రవీందర్ రెడ్డి, మహేష్ నాయుడు, నరేందర్ రెడ్డి, గోపి, నక్క విష్ణు, బసవరాజ్ గౌడ్, ఆదయ్య తదితరులు ఉన్నారు.
