Take a fresh look at your lifestyle.

గంజాయి రవాణా ముఠా అరెస్ట్. రూ. 48,38,500 విలువైన గంజాయి స్వాధీనం, రెండు కార్లు సీజ్

యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణి రామగుండం 11ఎ గాని క్రాస్ రోడ్ వద్ద గురువారం గోదావరిఖని రెండవ పట్టణ పోలీసులు రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డిసిపి చేతన, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ ల ఆధ్వర్యంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు గుర్తుతెలియని వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రెండు కార్లను, గంజాయిని స్వాధీనం చేసుకుని, రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం 11ఎ క్రాస్ రోడ్ వద్ద రెండవ పట్టణ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అక్రమంగా రవాణా చేస్తున్న రెండు కార్లను, గుర్తుతెలియని నలుగురు వ్యక్తులను అదుపులోకి, తరలిస్తున్న 96,770 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు కాగా అందులో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారయ్యారు. పట్టుకున్న గంజాయి విలువ 48, 38,500 రూపాయల విలువ ఉంటుంది.

ఇక రెండు కార్లు, ఆరు సెల్ ఫోన్లు సీజ్ చేసి, ఆరుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పట్టుబడిన వారిలో 1, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పట్టణానికి చెందిన ఉదయ్ వీర్ (32) తండ్రి పేరు జీతారామ్. 2, రాజస్థాన్ రాష్ట్రం ఎదల్పూర్ గ్రామానికి చెందిన రాజ్ లోథి సంజు (35) తండ్రి పేరు హరి సింగ్. 3, ఒడిస్సా రాష్ట్రం నందేపూర్ గ్రామానికి చెందినకేశవ్ ఖరా (25) తండ్రి పేరు లకమన్ ఖరా. 4, ఒడిస్సా రాష్ట్రం బీజాపూర్ గ్రామానికి చెందినసోమంత ఖోరా (50) తండ్రి పేరు సైరా సందురే. పరారీలో ఉన్న నిందితులు 5, సూరజ్ (వెర్నాకారు యజమాని). 6, చత్తీస్గడ్ రాష్ట్రాం జగదల్పూర్ గ్రామానికి చెందిన అర్జున్ భోరి. ఈ ఆరుగురు నిందితులు ముఠాగా ఏర్పడి చత్తీస్గడ్ రాష్ట్రంలోనీ జగదల్పూర్ నుండి మంథని మీదుగా మహరాష్ట్ర కు తరలించడం కొనసాగిస్తున్నారు ఇదే క్రమంలో గంజాయిని తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు మైన్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గంజాయి రహిత కమీషనరేట్ గా మార్చడానికి రామగుండం కమీషనరేట్ పోలీస్ విన్నూత కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

కమీషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు, నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు. గంజాయి అక్రమ రవాణాపై గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా ఉంచి, గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు నిర్వహించి గంజాయి సేవించే వారిని, వారికి గంజాయి అందించే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా గంజాయిని పండించినా/ అమ్మినా అక్రమంగా రవాణా చేస్తున్నా, తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసారు. యువకులు గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసై తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోవడంతో పాటుగా తమ కుటుంబాలను మొత్తం ఇబ్బందులలోకి నేట్టేస్తున్నారని, అంతేకాక గంజాయి మత్తులో మరియు డబ్బుల కోరకు నేరాలు చేయడానికి సైతం వెనకాడటం లేదని తెలిపారు. ఇలా జరగకుండా ఉండాలంటే గంజాయి అనే మహమ్మారిని మనం అందరం కలిసి అంతం చేయాలని గంజాయి రహిత కమీషనరేట్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ రామగుండం, టాస్క్ ఫోర్స్ రామగుండం, గోదావరిఖని రెండవ పట్టణ పోలీసు సిబ్బందినీ సీపీ అబినందించారు.

Leave A Reply

Your email address will not be published.