ముద్ర ప్రతినిధి, మెదక్:
ధృవీకరణ చట్టం-2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకు ఈ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ద్వారా ప్రధాని మోడీకి వినతిపత్రం పంపారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు జగదీశ్ చంద్ర, సత్యనారాయణ, మోహన్ రాజ్ తదితరులు పాల్గొని, పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.