ముద్ర, కోరుట్ల;
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గురువారం రోజు కోరుట్ల మండలం మోహనరావుపేట గ్రామం రైతువేదికలో నిర్వహించడం జరిగింది. వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి. సౌజన్య మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేపట్టాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, యూరియా వాడకాన్ని తగ్గించడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రత్యాన్మాయ పద్ధతులు పాటించడం, మార్కెట్ లో గిరాకీ ఉన్న వరి రకాలు పండించడంపై అవగాహన కల్పించారు. అలాగే వరిలో పంట అవశేషాలను తగులబెట్టకుండా కలియదున్నాలని ఏఈవో ఫమీనా యాస్మిన్ సూచించారు. ఈ కార్యక్రమం లో మోహనరావు పేట సర్పంచ్ ఎస్. లతిక నరేష్, చిన్న మెట్పల్లి సర్పంచ్ అబ్దుల్ రహీం, అభ్యుదయ రైతులు ఎ.వేణు, బి.సతీష్ రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.