Take a fresh look at your lifestyle.

మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్….

 

ముద్ర, కోరుట్ల;
మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మార్క్‌ఫెడ్ డీఎం కు ఫోన్ చేసి కోరారు. బుధవారం రోజు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా అని రైతుల గోస వినండి. పెట్టుబడి సాయం ఇవ్వక పోగా సకాలంలో యూరియా ఇవ్వలేరని ప్రభుత్వంపై మంది పడ్డారు. రైతు అప్పులు చేసి పంట పండిస్తే, దాన్ని కొనకపోతే ఎలా అని ప్రశ్నించారు. “మీడియా మేనేజ్మెంట్ వదిలి గ్రౌండ్‌లోకి వచ్చి రైతుల సమస్యలు తెలుసుకోండి” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్‌లో నిల్వ ఉన్న మొక్కజొన్న తడిసిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రారంభించకపోతే రైతులకు పెద్ద ఎత్తున నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రైతు ధాన్యాన్ని పారదర్శకంగా, ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలని తెలిపారు. రైతుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని రైతులకు భరోసాను ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, నాయకులు చీటి వెంకట్రావు, కౌన్సిలర్ కొక్కెర వెంకటేష్, ఎలుగూరి కిరణ్, నీలి శ్రీనివాస్, గేల్లె గంగాధర్, వీరబత్తిని దశరథం, వ్యవసాయ అధికారి నాగమణి, రైతులు పాల్గొనారు.

Leave A Reply

Your email address will not be published.