ఎమ్మెల్యే ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేందుకే కేసు నమోదు చేయించిన బి ఆర్ ఎస్ నాయకులు -తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ,
ముద్ర, తాండూర్ ప్రతినిధి:
తాండూర్ నియోజకవర్గ ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేక బి ఆర్ఎస్ నేతలు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ తెలిపారు. శనివారం ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తూ, గత పాలకులు చేసిన అవినీతిని ఎండగడుతూ ప్రజల్లో ఆదరభిమానాలు పెంపొందించుకుంటున్న ఎమ్మెల్యే ఎదుగుదలను చూసి తనపై, తన అనుచర వర్గం పైన కేసు నమోదు చేయించడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ పట్టణ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఓటమిని జీర్ణించుకోలేక, ఎమ్మెల్యే పైన అనవసర రాద్ధాంతం చేస్తూ తన ప్రతిష్ట దెబ్బతీసేలా బి ఆర్ ఎస్ నాయకులు ప్రవర్తిస్తు, తప్పుడు కేసులు నమోదు చేయించారని, వారికి త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెబుతామని వారు పేర్కొన్నారు.