Take a fresh look at your lifestyle.

అభివృధి పనులను త్వరగా పూర్తి చేయాలి

  • అధికారులతో పెద్దపల్లి ఎమ్మెల్యే సమీక్ష.

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు.జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగావారం పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించాలని గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.