పేట మినీ స్టేడియం మైదానం అభివృద్ధికి 25 కోట్లు మంజూరు – మంత్రి వాకిటి శ్రీహరి
రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం జిల్లాకే గర్వకారణం -కలెక్టర్ సిక్త పట్నాయక్
కబడ్డీకి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర – ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్
అట్టహాసంగా రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు ప్రారంభం

ముద్ర, నారాయణపేట: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడా పాలసీలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ సెకండ్ ఎడిషన్ కబడ్డీ పోటీలను మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ సిక్త పట్నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ మక్తల్ మినీ స్టేడియం అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేశామని త్వరలో పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 జట్లు కబడ్డీ పోటీలో పాల్గొనడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ కోసం మక్తల్ కు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. తాను చిన్న తనంలో ఇక్కడే ఈ మట్టి లో ఆడేవాళ్ళమనీ,ఈ మట్టిలో ఆడిన వ్యక్తి గా ఇక్కడ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కోరిక మేరకు నారాయణ పేట జిల్లా కేంద్రంలోని మైదానం అభివృద్ధి కోసం కూడా 25కోట్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు. క్రీడలకు రాష్ట్ర బడ్జెట్ లో 1600 వందల కోట్ల కేటాయిస్థామని, క్రీడాకారుల కోసం 25 కోట్లతో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఆడితే క్రీడాకారులకు సంబంధించిన ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు 3 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నామన్నారు. క్రీడల, క్రీడాకారుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో సానుకూలంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి క్రీడా కారులను వెలికితేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్స్ పాలసీ తీసుకొచ్చిందనీ చెప్పారు. బడ్జెట్ లో ఈ సారి స్పోర్ట్స్ కు అధిక నిధులు కేటాయించబోతున్నామని వెల్లడించారు. గ్లోబల్ సుమ్మిట్ లో క్రీడా శాఖ కి 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనీ తెలిపారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతి జిల్లాకు ఒక ఆటను ఎంపిక చేశారని, మన జిల్లాకు కబడ్డిని ఎంపిక చేయగా రాష్ట్రంలోనే ఇదే మొదటి ఈవెంట్ అని తెలిపారు. ఇది మంచి అవకాశమని, జిల్లాకే గర్వకారణమన్నారు. ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ మాట్లాడుతూ.. ఆటలలో కబడ్డీ కల్చరల్ కింగ్ అన్నారు. దేశంలో కబడ్డీ ఆటకు ఎంతో ప్రాధాన్యం ప్రాముఖ్యత, ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. 4 వేల సంవత్సరాల చరిత్ర కబడ్డీకి ఉందన్నారు. మన దేశం ఇప్పటిదాకా కబడ్డీలో మూడు సార్లు ప్రపంచ కప్ సాధించిందని ఎస్పీ తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్, మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస, వైస్ చైర్ పర్సన్ శైవి రెడ్డి, మక్తల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రాధా లక్ష్మారెడ్డి, డిఇఓ గోవిందరాజులు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేష్ శెట్టి ఆయా జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
Athlete IncentivesCM Cup KabaddiCollector Sikta PatnayakGachibowli Sports HospitalGlobal Sports InvestmentMaktal Mini StadiumMinister Vakiti SrihariSports Infrastructure
0 45