Take a fresh look at your lifestyle.

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

 

ముద్ర, గద్వాల:

అమావాస్య సందర్భంగా కేటిదొడ్డి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన పాగుంటా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అఖండ భజనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కన్నుల పండువగా స్వామీ వారి కళ్యాణోత్సవం

అమవాస్య సందర్భంగా పాగుంటా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఉదయం ప్రాతఃకాల పూజలు, అభి షేకం, దీక్షా హోమం, శాంతిహోమం, పూర్ణాహుతి, చక్ర స్నానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

అనంత రం అలివేల మంగ సమేత లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రథోత్సవ కార్యక్రమాని నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.