Take a fresh look at your lifestyle.

ఆయనో ఎలక్షన్ గాంధీ!

  • రాహుల్ పై సెటర్లు వేసిన కవిత.

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీ..ఒక ఎలక్షన్ గాంధీ అని బీఆర్ఎస్ ఎంఎల్ సీ కవిత మండిపడ్డారు.ఆయనకు తెలంగాణలో ఎన్నికలు ఉన్నప్పుడే ఇక్కడి ప్రజలు గుర్తొస్తారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన రాహుల్ గాంధీ,ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బుల్డోజర్లు పెట్టి పేదల ఇండ్లు కూల్చినప్పుడు, హెచ్ సీయూలో చెట్లు పీకేస్తున్నప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.శనివారం ఒక ఇంగ్లీష్ ఛానెల్ తో మాట్లాడుతూ, రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.గతంలో చెప్పాను,వంద సార్లు అయినా పిలుస్తా..రాహుల్ గాంధీ,ఎలక్షన్ గాంధీ అని మరోసారి వ్యాఖ్యానించారు.ఎన్నికలప్పుడు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటారని విమర్శించారు.కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయలేదు,ప్రజలకు ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు.బీఆర్ఎస్ నేతలపై ఉన్న కేసుల గురించి మాట్లాడే ముందు,రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి లు బెయిల్ పై ఉన్నారో లేదో ఆలోచించుకోవాలని హితవుపలికారు.ఇతరుల పై ఒక వేలు చూపించినప్పుడు నాలుగు వేళ్లు తమరి వైపు చూపిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.