ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు
ధర్మపురి:
శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ధర్మపురి మున్సిపల్ పరిధిలోని 15 వార్డులకు గాను 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు శనివారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ ఓటర్లు 2023 లో జరిగిన శాసనసభ ఎన్నిక ల్లో తనను గెలిపిస్తే గడిచిన రెండు సంవత్సరాలుగా అనేక అభివృద్ధి శ్రీకారం చుట్టడం తో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను 100% గెలిపించడం సంతోషం అన్నారు.
ఓటర్ల ఇచ్చిన తీర్పుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.