ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం పాలమూరు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీరానికి చేరాయి. గెలిచిన 29 మంది కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు, కీలకమైన స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం చీరాలలోని ఒక ప్రైవేట్ బీచ్ రిసార్ట్‌కు తరలించినట్లు సమాచారం.శుక్రవారం అర్ధరాత్రి బస్సుల్లో బయలుదేరిన అభ్యర్థుల బృందం శనివారం ఉదయానికి చీరాల తీరానికి చేరుకుంది. మేయర్ ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఇతర పార్టీల నుంచి ప్రలోభాలు వచ్చే అవకాశం ఉండటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలుఎప్పటికికప్పుడు పరిస్థితి సమీక్ష చేస్తున్నారు.చీరాల క్యాంప్‌లో ఉన్న అభ్యర్థులకు కూడా తమలో మేయర్ ఎవరనే క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.