- విద్యార్థులకు అభినందనలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
కోరుట్ల/మేడిపల్లి, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నుండి 40 మంది విద్యార్థులు హైదరాబాద్ లోని ఇస్రో విభాగమైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ములుగు ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను సందర్శించారు. ఏన్ఆర్ఎస్సి లో విద్యార్థులకు స్పేస్ రంగంలో జరుగుతున్న వివిధ మిషన్స్, ఉపగ్రహాలు వాటి డేటా ఎలా ప్రాసెస్ చేస్తారు, భారత అంతరిక్ష పరిశోధనల గురించి అక్కడి శాస్త్రవేత్తలు వివరించారు. అలాగే ములుగు ఫారెస్ట్ కాలేజీ లో వివిధ అటవీ శాఖల గురించి అక్కడి ప్రొఫెసర్ లు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హైదరాబాద్ మీటింగుకు వెళ్తూ మార్గమధ్యంలో కొమురవెల్లి వద్ద విద్యార్థులను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించారు. మన విద్యార్థులు భవిష్యత్ లో శాస్త్ర సాంకేతిక రంగాలలో మంచి స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచనతో ఈ వినూత్న కార్యక్రమానికి మన ఊరు ఫౌండేషన్ శ్రీకారం చుట్టడం జరిగిందని మన ఊరు అసోసియేషన్ అధ్యక్షులు వెల్మ నవీన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, ఏఏంసీ ఛైర్మెన్ మాదం వినోద్, మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు, సీనియర్ నాయకులు మునుగూరి గణేష్, ఏంఈఓ ఆకుల లక్ష్మీ నరసయ్య మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.