ముద్ర, జగిత్యాల టౌన్: జగిత్యాల ఎస్.కే.ఎన్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్ధాలపై డాక్టర్ సాకేత్ రెడ్డి మంగళవారం అవగాహన సదస్సు నిరసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న యువత, ముందుగా తెలియకుండా కేకులలో లేదా ఏదైనా డ్రింక్స్ లలో మత్తు పదార్థాలు కలిపి వాటికి అలవాటు చేయబడుతున్నారని, తద్వారా ఆ డ్రగ్స్ లేకుండా వారు ఉండలేరని, డ్రగ్స్ కి అలవాటు పడి వారి యొక్క బంగారు భవిష్యత్తు ను పాడు చేసుకోవద్దని వివరించారు. కనుక కొత్త వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, కొత్త అలవాట్లు ఎలాంటివి చేసుకోకూడదని వివరించారు.అనంతరం ఉమెన్ అండ్ చైల్డ్ వేల్ఫేర్ (సఖి) ఆర్గనైజేషన్ వారు పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా తోటి స్త్రీ సమాజం పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని, ఎవరి పట్ల కూడా అమర్యాదగా మాట్లాడవద్దని, దురుసుగా ప్రవర్తించకూడదని, ఎలాంటి అతి చేయకూడదని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే శిక్షలు తీవ్రంగా ఉంటాయని, భవిష్యత్తు లో అంధకారం ఏర్పడుతుందని వివరించారు. అలాగే జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో షీ టీం సభ్యులు విద్యార్థులకు ఈవ్ టీజింగ్ గురించి అవగాహన కల్పించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లయితే, వారినీ సంబంధిత అధికారులను కలిసి పరిష్కారం కొరకు షీ టీం 8712670783, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930, చైల్డ్, వుమెన్ హెల్ప్ లైన్ 1098 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.