ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఆటో అదుపుతప్పి డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. భువనగిరి మండలం కూనూరు గ్రామానికి చెందిన వడి గిరి(36) ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజులాగే శనివారం భువనగిరి పట్టణంలో ఆటో నడుపుతుండగా మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో పాత బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురుగా ఆటో అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టగా మెడ వద్ద తీవ్ర గాయం అవ్వడం వలన అధిక రక్తస్రావం కావడంతో అతన్ని ఏరియా హాస్పిటల్ కు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.