Take a fresh look at your lifestyle.

అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది

  • రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంఆకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ లోని తుంకులగడ్డలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిగి ఎమ్మెల్యే , డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి కలిసి గురు వారం సాయంత్రం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరు చోట్ల విద్యా బోధన వల్ల ఈ వ్యవస్థ మమ్మల్ని దూరం పెడుతుందన్న భావన విద్యార్థుల్లో కలిగే ప్రమాదం ఉంది. అలాంటి భావన సమాజానికి, దేశానికి మంచిది కాదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాతిక ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అందరూ కలిసిమెలిసి ఒక సోదర భావంతో చదువుకుని రాణించాలన్న సంకల్పంతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించాలని,bఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అద్భుతమైన మేదస్సుతో సమాజానికి మానవ వనరులను అందించాలన్నదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఉద్దేశమన్నారు.విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ పై మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని అన్నారు. ప్రైవేట్ సెక్టారు లో ఎలాంటి వసతులు ఉన్నాయో, అలాంటి వసతులు మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటాయని అన్నారు. ఈ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు క్రికెట్, ఫుట్బాల్ అవుట్ డోర్, ఇండోర్ ఆటలకు సంబంధించి క్రీడా ప్రాంగణాలు ఉండేలా దాదాపు 25 ఎకరాల్లో డిజైన్ చేశామని వివరించారు. స్టూడెంట్స్తో పాటు టీచింగ్ స్టాఫ్ ఉండేలా వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.ఈ స్కూళ్లు దేశానికి రోల్ మోడల్ గా నిలువనున్నాయన్నారు. నియోజకవర్గాని మాకంటే మంచిగా పనిచేసే నాయకుడు ఎంఎల్ఏ రామ్మోహన్ రెడ్డి పరిగి నియోజకవర్గానికి అభివృధి ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు కావాలని, నిధులు కావాలని అభివృద్ధి పనుల కోసం తపించే పని చేసే నాయకుడు ఎంఎల్ఏ రామ్మోహన్ రెడ్డి అని తెలిపారు. చదువులకు కులం మతం పేదరికం లాంటివి అడ్డు కావు అని కష్టపడి పనిచేస్తే అందరూ ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండాలి అని సంకల్పిస్తూ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాలు రూ.200 కోట్ల తో చేపడుతున్నామని తెలిపారు. ఎంఎల్ఏ రామ్మోహన్ రెడ్డి తపన ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేశారని ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పై, ఆర్థిక శాఖ మంత్రులపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రాజెక్టుల సాధనకోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఎంఎల్ఏ రామ్మోహన్ రెడ్డి పరిగి నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందించాలని లక్ష్యానికి నేను కూడా తోడుగా ఉంటూ అతి త్వరలో ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వే పనుల కోసం జిఓ విడుదల చేస్తామని త్వరలో ప్రభుత్వం రంగా రెడ్డి జిల్లాకు పరిగి నియోజకవర్గానికి సాగునీరు అందించే లక్ష్యంగా ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు ఆకాశమే హద్దుగా చదివి ఉన్నత స్థాయికి ఎదగడానికి జీవిత లక్ష్యంగా పెట్టుకొని పని చేయాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు, 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా వేశామని, రుణమాఫీ చేశామని, ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.పరిగి ఎంఎల్ఏ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తుందని తెలిపారు అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇందిరమ్మ దశలో ఉన్నాయని అదే విధంగా రేషన్ కార్డులు మరియు రైతు భరోస లాంటి పథకాలను అందిస్తున్నామని తెలిపారు.అదేవిధంగా వారికి నేర్చుకోండి సాగునీరు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి దృష్టికి తీసుకొని వెళ్ళాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా మీరు కూడా సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.