కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేఖరి: భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను భారతదేశం నుండి బహిష్కరించెందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో కథలాపూర్ ఎమ్మార్వో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వరరావు, బద్రి సత్యం, బండ అంజయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు కథలాపూర్, నరెడ్ల రవి, మహేష్, మల్యాల శ్రీనివాస్, దండిక లింగం, కాసోజి ప్రతాప్, పాల్గొన్నారు.