మీ ఆస్తులకు రక్షణ బాధ్యత నాది
కబ్జాదారుల అంతు చూస్తా
చచ్చి బతికి మీకు సేవ చేసేందుకే వచ్చిన
ఈ జన్మాంతం మీ సేవకుడినే…
కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే…
బీఆర్ఎస్ 4 సీట్లకే పరిమితం కాబోతోంది…
కాంగ్రెస్, ఎంఐఎం కలిసినా 20 సీట్లలోపే..
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఈసారి భారతీయ జనతా పార్టీదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ప్రజల ఆస్తులకు రక్షణ కవచంగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఇకపై కరీంనగర్ లో ప్రజల జాగాలను కబ్జాలు చేసే నాయకుల భరతం పడతానని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో కబ్జాలకు పాల్పడిన 9 మంది కార్పొరేటర్లను అరెస్ట్ చేయించి బొక్కలో వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ పనైపోయిందని, ఈ ఎన్నికల్లో 4 సీట్లకే పరిమితం కాబోతుందన్నారు. కాంగ్రెస్,ఎంఐఎం కలిసినా 20 సీట్లు దాటబోవని అన్నారు. కేంద్రం నుండి వరదలా నిధులు వస్తున్నాయని, మేయర్ పీఠాన్ని అప్పగిస్తే మరింత అభివ్రుద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కరీంనగర్ లోని రాజస్తాన్ చౌరస్తా, లయోలా కాలేజీ, బుట్టి రాజారాం కాలనీల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని 16, 19, 20 డివిజన్ల అభ్యర్థులు గిత్త రాజేంద్ర ప్రసాద్, మూల రుక్మిణీ, జాడి బాల్ రెడ్డి లను గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
రాజస్థాన్ చౌరస్తా వద్ద…
పెద్ద పంచాయతీ గా ఉన్న మల్కాపూర్ కరీంనగర్ కార్పొరేషన్ లో కొత్తగా కలిసినా పెద్దగా అభివ్రుద్ధి లేదు. కేంద్ర నిధులతోనే చింతకుంట నుంచి శాతవాహన యూనివర్సిటీ వరకు.. రోడ్డు వేయడంతో పాటు అందమైన డివైడర్లు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసిన.
శ్రీ లక్ష్మి హోమ్స్ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి సరఫరా కూడా సరిగా లేదు. SC కాలనీలో రాజస్థాన్ హోటల్ దగ్గర రోడ్డు విస్తరణ లేదు. లక్ష్మీపూర్ నుంచి చింతకుంట వరకు రోడ్డు చాలా దెబ్బతిన్నా కొత్త రోడ్డు వేయలే. ఇక్కగ వీధి దీపాలు, CC కెమెరాలు లేక రక్షణ కరువైంది.
ఇప్పటివరకు ఈ ప్రాంతంలో BJPకి అవకాశం రాలేదు. ఈసారి బీజేపీ అభ్యర్ధి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించండి… మీ ప్రాంత అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా. కరీంనగర్ కార్పొరేషన్ లో కలిసిన విలీన గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.
అమృత్ 2.0 ద్వారా రూపాయిలు 132 కోట్లు వచ్చాయి. మల్కాపూర్ చింతకుంట ఏరియాలో మొత్తం వాటర్ సప్లై చేసి ఈ ప్రాంత రూపు రేఖలు మారుస్తా. మల్కాపూర్ కు మొత్తం 11 కొత్త సీసీ రోడ్లు రూ.11.60 కోట్ల నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తా. ఇందుకు సంబంధించిన నిధులు సిద్ధంగా ఉన్నాయి. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తాం . చింతకుంట కూడా ఆరు రోడ్లు డ్రైనేజీ కోసం.. రూపాయలు 6. 52 కోట్లు సిద్ధంగా ఉన్నాయి.
ఈ ప్రాంతంలో పోచమ్మ గుడి, డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఝప్తులు వచ్చాయి. ఆ బాధ్యత నేను తీసుకుంటా.
లయోలా కాలేజీ వద్ద…
కరీంనగర్ లో రేకుర్తి ముఖచిత్రం అభివృద్ధి పరంగా మార్చి చూపించింది కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులే.. ఓవైపు భూ కబ్జాదారులు కొందరు ఇక్కడి భూముల్ని జాగాలు విధ్వంసం చేస్తుంటే.. మేము ఇక్కడ ప్రజల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నాం.
అత్యధికంగా ఇక్కడి చాలా రోడ్లు కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించాం. రేకుర్తి చౌరస్తా నుంచి చింతకుంట చౌరస్తా దాకా యూనివర్సిటీ మీదుగా జాతీయ రహదారి నిధుల నుంచి రోడ్డును వెడల్పు చేసి డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ తో ఈ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దాం.
సిసి రోడ్లు చాలా కాలనీలో ఏర్పాటు చేశాం శాతవాహన కాలనీలో కొత్త రోడ్లు వేసాం. లయన్స్ కంటి ఆసుపత్రి రోడ్డును కొత్తగా నిర్మించాం. రేకుర్తిలో నేషనల్ హెల్త్ మిషన్ నిధుల ద్వారా బస్తి దవాఖానను పేద ప్రజల కోసం ఏర్పాటు చేశాం.
20 వ డివిజన్లో శివాలయం ప్రాంతంలో స్మార్ట్ సిటీ నుంచి రోడ్లు వేశాం. ప్రస్తుతం కొన్ని చోట్ల వాటర్ పైప్లైన్ పనులు నడుస్తున్నాయి .వాటిని త్వరలో పూర్తి చేస్తాం. అమృత్ 1.0 తో వచ్చిన నిధులతో నిధులతో ఈ ప్రాంతంలో కొంత తాగునీటి ఇబ్బంది తీర్చాం. ప్రస్తుతం అమృత్ 2.0 ద్వారా వచ్చిన నిధులను ఆరు నెలల్లోనే ప్రతి గల్లీకి తాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. కొత్తగా రిజర్వాయర్లు కడుగుతాం సంపు హౌస్ లు నిర్మిస్తాం పైపులైన్లు ఏర్పాటు చేస్తాం.
అంతేకాకుండా ఈ రేకుర్తి నుంచి కొత్తపల్లి వరకు. రోడ్డు వేసి అద్భుతమైన డివైడర్లు పెట్టి స్ట్రీట్ లైట్ తో కొత్తపల్లి వరకు సరికొత్త మార్గాన్ని నిర్మిస్తాం. రేకుర్తిలో ఇటీవల కొత్తగా రెండు రోడ్లకు రూపాయలు 1. 94 కోట్లతో నిధులు మంజూరు చేసాం. ఎన్నికలు పూర్తవగానే పనులు ప్రారంభిస్తాం.