బీఆర్ఎస్ బిజెపితో ఏ పని కాదు..కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..
ప్రజలకు పనులు చేసేది
ప్రజా ప్రభుత్వమే..
బీఆర్ఎస్ బిజెపితో ఏ పని కాదు..
ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పండి..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..
ప్రజలకు పనిచేసేది పెట్టేది ప్రజాపాలన ప్రభుత్వమేననీ, బీఆర్ఎస్ బిజెపితో ఏ పని కాదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
శనివారం కరీంనగర్లోని రాంనగర్ టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డు బ్రిలియంట్ స్కూల్ వద్ద 13, 45, 46, 62 డివిజన్లకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక బృహత్తర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు తో పాటు తాను కాంగ్రెస్ నాయకులం కలిసి కరీంనగర్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కరీంనగర్ అన్ని రంగాల్లో తీర్చదిద్దుతామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆయా డివిజన్లను అత్యద్భుతంగా తయారు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని రాజేందర్రావు కోరారు. టిఆర్ఎస్ బిజెపిలకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారితో ఏ పని సాధ్యం కాదని ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక ఏ పనైనా మేమే చేసి పెడతామని రాజేందర్రావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, ఆయా డివిజన్ల ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.