Take a fresh look at your lifestyle.

అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం..

ఈ నెల 9 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ హనుమంత రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్‌ సైట్
http://ipr.telangana.gov.in ద్వారా ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.జిల్లా స్థాయిలలో ఆన్‌ లైన్ దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ నుంచి సమర్పించాలని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.