కుప్పం
గుడిపల్లి మండలంలో ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ ప్రాంగణంలోని టీచర్ల ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
రూ. 3 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచర్ల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు.
ఏడాదికి 5 వేల మంది టీచర్లు, స్కూల్ లీడర్లను తీర్చిదిద్దేలా శిక్షణ ఇవ్వనున్న ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ.
ఆధునిక, శాస్త్రీయ శిక్షణా కేంద్రంగా పేరొందిన అగస్త్య విద్యాచల్ అకాడెమీ
DIETలు, బ్లాక్ రిసోర్స్ సెంటర్లు, లైవ్ ఇంట్రాక్షన్ కోసం టూ వే బ్రాడ్ కాస్ట్ స్టూడియోలతో అత్యాధునిక ఏర్పాట్లు.
అకాడెమీలోని శిక్షణా కేంద్రాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.
అకాడెమీ ప్రాగంణంలోనే లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ కు చంద్రబాబు శంకుస్థాపన.
రూ. 10 కోట్ల వ్యయంతో అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మించేలా ప్రణాళికలు.
జాతీయ స్థాయిలో శిక్షణకు ఉపయోగడేలా అకామిడేషన్ ఫెసిలిటీ క్యాంపస్ కు రూపకల్పన చేసిన ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ.
ప్రస్తుతం 240 మందికి అకాడెమిషన్ ఫెసిలిటీ కల్పిస్తోన్న విద్యాచల్ అకాడెమీ.
దీన్ని మరింత విస్తరిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ.
ఇదే ప్రాంగణంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్ కు శంకుస్థాపన.
మల్టీ మీడియా ఎక్స్ పీరియన్స్ కలిగించేలా విజిటర్స్ సెంటర్ రూపకల్పన.
ట్రైనింగ్ తీసుకుంటున్న టీచర్లను పలకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
రకరకాల కిట్లతో టీచర్ ట్రైనింగ్ ఇస్తున్న విధానాన్ని పరిశీలించిన సీఎం.
పిల్లలకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన ఏ విధంగా చేయాలనే అంశంపై
శిక్షణ తీసుకుంటున్నట్టు సీఎంకు వివరించిన టీచర్లు.