Take a fresh look at your lifestyle.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం- కలెక్టర్ ప్రతిమసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
రైతు సంక్షేమంలో భాగంగా మెదక్ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల వద్ద నుండి చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో నగదును జమ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వేసవి దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళలలో ధాన్యం తూకం, రవాణా ప్రక్రియ కొనసాగించడం జరుగుతుందని, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి 67,489 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెసి 62.87 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచాలని కేంద్రాల నిర్వహకులకు సూచించారు.
జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు.
టార్పాలిన్లు 15540, తూకం వేసే యంత్రాలు 668, ప్యాడీ క్లీనర్లు 278, తేమ శాతం చూసే మెషిన్లు 664 అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.