వికారాబాద్, ముద్ర విలేకరి : నేడు బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్య భారతి కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశానికి పార్టీ బాధ్యులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం తో పాటు జై బాబు, జై భీమ్, జై సం విధాన్- అభియాన్ ర్యాలీ ఉంటుందని ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్రస్థాయి పార్టీ బాధ్యులు వివిధ పదవులు చేసిన నాయకులు జిల్లా నాయకులు పాల్గొంటున్నారని జిల్లా స్థాయి పార్టీ బాధ్యులు కార్యకర్తలు తప్పనిసరి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.