Take a fresh look at your lifestyle.

భక్తి శ్రద్ధలతో బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం, అగ్ని గుండాలు.

మోత్కూర్ ముద్ర న్యూస్:
మోత్కూర్ మండలంలోని ముషిపట్ల గ్రామంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం, అగ్ని గుండాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.మహా శివ రాత్రి ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి బుగ్గరామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. కళ్యాణోత్సవం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణోత్సవాన్ని పురోహితులు ప్రదీప్ శర్మ,సందీప్ శర్మ లు నిర్వహించగా దేవాలయ ఇంచార్జ్ ఈ ఓ రాంగోపాల్ రావు స్వామి అమ్మ వార్ల కు పట్టు వస్త్రాలను అందించారు. సోమవారం ఉదయం బుగ్గరామలింగేశ్వర స్వామి గుట్ట కింద అగ్ని గుండాలు నిర్వహించారు. భక్తులు శివ నామస్మరణ చేస్తూ అగ్ని గుండాలు దాటి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫైళ్ల నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ అంజయ్య, వార్డు సభ్యులు,దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎం.శేఖర్, సభ్యులు గ్రామస్థులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.