Take a fresh look at your lifestyle.

పూర్ణగిరి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నామత్‌పల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సుదర్శన పూర్ణగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రావి సురేందర్ రెడ్డి కలెక్టర్‌ను సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.