Take a fresh look at your lifestyle.

హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి దామోదర

మంత్రి పలుమార్లు ఆస్పత్రిని తనిఖీ చేసిన మారని వైనం
జోగిపేట హాస్పిటల్లో రిజిష్టర్ పరిశీలిస్తున్న మంత్రి.


సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి:
మంత్రి ఈరోజు సాయంత్రం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా బాలింతల వార్డుకు వెళ్లి అక్కడ వారితో అందుతున్న సేవలను తెలుసుకున్నారు అనంతరం హాస్పిటల్ లో అన్ని వార్డులలో తిరుగుతూ వైద్యుల గదికి చేరుకున్నారు. మంత్రి వచ్చిన వార్డులు పరిశీలిస్తున్న సమయంలో వైద్యులు ఎవరు అందుబాటులో లేకపోవడం గమనార్హం. కొద్ది సేపటికి అందుబాటులో ఉన్న జూనియర్ డాక్టర్ సంతోష్ వచ్చాడు. డాక్టర్ సంతోష్ తో రోజు ఎన్ని టెస్టులు చేస్తున్నారు ఏ విధంగా వైద్య సహాయం అందిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నాడు. ఒకే ఒక్కడు అందుబాటులో ఉండటంతో మంత్రి దామోదర్ డీసీహెచ్ఎస్ పై అగ్రహాం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా వైద్యులు గైర్హాజరు కావడం తనిఖీలలో బయటపడింది. జోగపేట హాస్పిటల్ ఎప్పటికీ మారదా ఇంతేనా అంటూ ఫోన్లో వైద్యవిధాన పరిషత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకుంటే కఠీన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. గైర్హాజరు అయిన వారిని సస్పండ్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో తనకు రిపోర్టు అందించాలని అధికారులను ఆదేశించాడు ఆయన వెంట జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.