ఆరోగ్య శేరిలింగంపల్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దాడమే నా ధ్యేయం-పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి :
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఏఎస్ రాజు నగర్ కాలనీ లో రూ.19 లక్షల రూపాయల అంచనావ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను మరియు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవిడుపు పరికరాలు ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎయెస్ రాజు నగర్ కాలనీ లో ఈ రోజు ఓపెన్ జిమ్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు, పెద్దలు వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చైర్మన్ గాంధీ తెలియచేసారు. పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయడం జరిగినది అని. అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది గాంధీ తెలియచేసారు.
రాబోయే రోజులలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని కాలనీ లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతున్నదనన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నాయి నేనీ చంద్రకాంత్ రావు, నర్సింహ రావు మరియు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.