- సైన్స్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
- కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు
- జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని
ముద్ర,పానుగల్: విజ్ఞాన మేలలు విద్యార్థుల మేధో శక్తిని పెంపొందించడానికి దోహదపడతాయని వనపర్తి జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని అన్నారు.మంగళవారం పానుగల్ మండల పరిధిలోని తెల్లరాల్లపల్లి గ్రామంలో లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ మేళాలో విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల ప్రయోగాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు.కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దానికి అనుగుణంగా విద్యార్థులు చదవాలన్నారు.విద్యతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో దాదాపు 100 కు పైగా స్టాల్స్ ను విద్యార్థులు ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు,సామాజిక కార్యకర్త శ్రీ గంధం నాగరాజ,పాఠశాల కరస్పాండెంట్ కాకం ఆంజనేయులు, ప్రిన్సిపాల్ భాస్కర్,ఉపాద్యాయ బృందం పాల్గొన్నారు.
