Take a fresh look at your lifestyle.

యోగ డేను సక్సెస్ చేయాలి

  • అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : గచ్చిబౌలిలోని గంటి మోహన చంద్ర బాలయోగి (జీఎంసీ బాలయోగి) స్టేడియంలో తెలంగాణ ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు.ఈ మేరకు శనివారం యోగా డే ఏర్పాట్లపై అధికారులతో మంత్రి రాజనర్సిం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం నాడు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగ కార్యక్రమం లో భాగంగా తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ కు చెందిన యోగ శిక్షకులు, మెడికోలు, వివిధ పాఠశాల లకు చెందిన 5500 విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. అలాగే ఆదివారం ఉదయం 6.30 నుండి 7.00 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ప్రసంగం ను విక్షేందుకు స్టేడియం లో ఎల్ ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 7.00 నుండి 7.45 వరకు యోగ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, వాకిట శ్రీహరి, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని మంత్రి రాజనర్సింహా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.