24 గంటల్లోగా వడ్లు కొనకపోతే మీ సంగతి చూస్తాం : కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి పంజుగుల హెచ్చరిక
యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష
ముద్ర, తాండూర్ ప్రతినిధి:
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం చేపట్టిన జరిగిన రైతు దీక్ష విజయవంతమయింది.
శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ముఖ్యకంత్రి ప్రభుత్వం రైతుబంధు, రుణమాఫీ, యూరియా – ఏదీ ఇవ్వకున్నా రైతులు శ్రమించి పంట పండిస్తున్నరు. మీరు కొనేది పోయి ఉల్టా వాళ్ళను గోస పెడుతున్నరు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, బాధ్యత వహించి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి పొట్ట దశలో ఉన్న పంటలు ఎండబెట్టకండి’ అంటే, అప్పుడు నీళ్ళు ఒదిలిన్రు. కానీ, ముఖ్యకంత్రికి మాత్రం రైతుల పట్ల సోయి లేదు. ముఖ్యకంత్రి ఇంట్లో నలుగురు ముఖ్యకంత్రిలు; ఎమ్మెల్యే ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు – ఏం చేస్తున్నారన్నారు. రైతాంగాన్ని గోస పెట్టుడు బంజేయండి. ప్రకృతి వనరుల దోపిడీ ఆపండి. తాండూరు కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచించాలి, రేవంత్ రెడ్డి మీ పార్టీని ముంచుతున్నడు. ప్రజా సమస్యల విషయంలో బీఆర్ఎస్ పోరాటం ఆగదు. పోలీసులు చట్టప్రకారం నడవాలి, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు, నిర్బంధాలు ఆపండి. లేకపోతే న్యాయపోరాటం తప్పదు అని హెచ్చరించారు
మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలు నడవకుండా ఎమెల్యే మనోహర్ రెడ్డి మిల్లర్లకు సహకరిస్తున్నారు. ధాన్యం కొనేందుకు లంచాలు అడుగుతున్న అధికారులు. కోడంగల్ రేవంత్ రెడ్డి ఇంట్లో, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇంట్లో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ధాన్యం గుమ్మరిస్తం. రాబోయే పంచాయత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి మన హక్కులు సాధించుకుందాం అని అన్నారు.
దీక్షను ఉద్దేశించి మాట్లాడినవారిలో తాండూరు మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రమేష్, మాజీ సర్పంచ్ బసిరెడ్డి, కౌన్సిలర్లు సంతోష్, జావేద్; నాయకులు శివ్, పాండురంగా రెడ్డి, రాకేశ్, నారాయణ, శరణ్ కుమార్ ఉన్నారు.
సీనియర్ నాయకులు పట్లోళ్ళ నర్సిములు, వెంకట్ రెడ్డి, మల్లా రెడ్డి, నర్సిరెడ్డి సహా శేఖర్ రెడ్డి, చిట్టి, రాములు, సిద్ధారెడ్డి, అరవింద్, గోరేపల్లి రవిగౌడ్, కౌన్సిలర్లు ఇర్షాద్, కరుణాకర్, యోగి, సురేష్, ఇజాజ్, అనంత్ రెడ్డి, బీఆర్‌ఎస్‌వి నాయకులు దత్తాత్రేయ, అగ్గనూర్ దత్తు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
దీక్షకు ముందు నాయకులు బెన్నూరు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడి, వారికి అండగా ఉంటామని, ప్రభుత్వంపై జంగ్ చేద్దామని, హక్కులు సాధించుకుందామని భరోసా ఇచ్చారు.