హైదరాబాద్ :
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
* పాలనలో ఇవాళ తీసుకున్న నిర్ణయాలన్నీ రేపటికి చరిత్ర అవుతాయి
* గతంలో ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా తదితర అంశాల్లో తీసుకువచ్చిన సంస్కరణలతో హైదరాబాద్ ఎకోసిస్టం వచ్చింది.
* ప్రపంచంలోని మోస్ట్ లివబుల్ సిటిగా హైదారాబాద్ అభివృద్ధి అయ్యింది.
* ఇదేమీ ఒక్కరోజులో జరిగింది కాదు. తెల్లవారు ఝామునే తనిఖీల నుంచి వివిధ నిర్ణయాలు ఈ మార్పునకు కారణం అయ్యాయి
* అప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే పంపుసెట్ గురించి మాట్లాడాలని విమర్శించారు
* అయితే గతంలో తీసుకున్న స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలితాలు ఇచ్చాయి.
* విభజన తర్వాత ఏపీలో ఒకే చోట పెద్ద మొత్తంలో భూమి లేదు అందుకే రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ అనే ఐడియాను తీసుకువచ్చాం
* అమరావతి నిర్మాణం జరుగుతుండగా గత పాలకులు దానిని శ్మశానం అని గేలి చేసి విధ్వంసం చేశారు
* ఇప్పుడు మళ్లీ దానిని పునర్నిర్మిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ ప్లస్ గా అమరావతి తయారవుతుంది
* టెక్నాలజీని అనుసంధానించి స్మార్ట్ సిటీగా, బ్లూ గ్రీన్ రాజధాని నగరం నిర్మాణం చేపడుతున్నాం.
* ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో వివిధ అంశాలపై ఇబ్బందులు వస్తున్నాయి. గ్యాస్ కొరత లాంటివి ఎదుర్కోంటున్నాం
* యుద్ధం తర్వాత మనల్ని మనం చాలా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
* ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది
* అమరావతి తర్వాత మరో పెద్ద ప్రాజెక్టు పోలవరం. గోదావరిలో వచ్చే 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం
* 2019 వరకూ 72 శాతం పనులు కూడా పూర్తి చేశాం. కానీ గత పాలకులు దానిని పట్టించుకోక ధ్వంసం చేశారు
* రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రాం వాల్ వాళ్ల హయాంలో ధ్వంసమైపోయింది. మళ్లీ అదే పనిని రూ.1000 కోట్లతో చేపట్టాల్సి వస్తోంది
* త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఇతర రాష్ట్రాలకూ ప్రయోజనం కలిగేలా చేయవచ్చు.
* ఏపీలో మూడు రీజియన్లుగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నాం.
* అమరావతిలో త్వరలోనే క్యాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుంది.
* త్వరలోనే క్వాంటం కంప్యూటర్ తయారీకి అవసరమైన పరికరాల తయారీ కూడా చేసేలా చేస్తున్నాం
* ఇప్పుడు గూగుల్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. రిలయన్స్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది
* 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాభివృద్ధికి విజన్ రూపకల్పన చేశాం
* వ్యవసాయం, సేవల రంగం, పారిశ్రామిక రంగం అభివృద్ధికి వీలుగా ప్రణాళికలు రూపొందించుకున్నాం
* ఉద్యాన, ఆక్వా రంగాల్లో కూడా ఎగుమతుల ద్వారా వృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాం
* ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యువ పారిశ్రామిక వేత్తల అవసరం చాలా ఉంది. దీనిని అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను
* ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా విజన్ డాక్యుమెంట్ రూపోందించాం
* 15 శాతం వృద్ధి రేటు నిలకడగా కొనసాగేలా చర్యలు తీసుకున్నాం.