Take a fresh look at your lifestyle.

ఆర్టిసి బస్సును ప్రారంబించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

ధర్మపురి, ముద్ర: పెగడపెల్లి మండలంలోనీ నంచర్ల నుండి దికొండ వరకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టిసి బస్సును గురువారం డిపో మేనేజర్ కల్పన కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల నాయకులు, అధికారులతో స్వయంగా బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, నంచర్ల నుండి దికొండ వరకు నడపనున్న నూతనంగా ఆర్టిసి బస్సును ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.గత ప్రభుత్వంలో ఉన్న పాలకులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఈ సమస్య గురించి కనీసం పట్టించుకోలేదని ఇక్కడి గ్రామస్థులు చెప్పడం, బస్సు కావాలని నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే జిల్లా సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ తో, ఆర్ ఎం,డియంలతో మాట్లాడి బస్సును ప్రారంభించడం జరిగిందన్నారు.గ్రామస్థులు అందరూ ఈ బస్సును వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టిసి ఎం.ఎఫ్ కవిత, బిఆర్ రావు, ఎస్ జె రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.