Take a fresh look at your lifestyle.

శ్రీ నందీశ్వర–నందేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం స్థానికంగా ప్రసిద్ధి చెందిన శ్రీ నందీశ్వర–నందేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. ఈ ఉత్సవాలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 2, 2026 వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయి.

మార్చి 31న ఉదయం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉత్సవ మూర్తులకు వాహన సేవలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 1న ఉదయం 8 గంటలకు విశేష పూజలు, మధ్యాహ్నం మహా ప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఉంటాయి.

ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది.

Leave A Reply

Your email address will not be published.