కోరుట్ల/మెట్పల్లి, ముద్ర విలేకరి: మెట్పల్లి పట్టణం లోని 9వ వార్డుకు చెందిన మహమ్మద్ సమీ అనే పెయింటర్ ఇటీవల ప్రమాదవశాత్తు ఆక్సిడెంట్ లో మృతి చెందారు. ఈ సందర్భంగా మెట్పల్లి డివిజన్ పెయింటర్స్, పిఓపి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుని కుటుంబానికి అన్ని రకాల ఆదుకుంటామని సంఘ అధ్యక్షుడు ఏశమేని గణేష్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో కలిసి చనిపోయిన కార్మికుడు సమీ భార్యకు పదివేల రూపాయలను నగదు రూపంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సమీ కొడుకు షాకిర్ మాట్లాడుతూ కుటుంబానికి అండగా నిలబడి సహాయం చేసినందుకు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఏశమేని గణేష్,క్యాషియర్ మాతంగి శ్రవణ్, చిట్యాల శ్యామ్, కనుక లక్ష్మణ్, రేవాళ్ళ రాజన్న మద్దూరి శ్యామ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.