- కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్.
- ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం.
కోరుట్ల, ముద్ర విలేకరి: పెంచిన స్టూడెంట్ పాస్ ధరలు తక్షణమే తగ్గించాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులు స్కూల్, కాలేజ్ కి సమయానికి వెళ్లేలా అధికారులు వారికీ బస్ సౌకర్యం కల్పించాలని, పక్క ప్రణాళికతో ఉండి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోకి బస్సులు కావాలని, మరిన్ని రిక్వెస్ట్ స్టాప్ లు కావాలని అధికారులకు విన్నవించారు. పెంచిన స్టూడెంట్ పాస్ ధరలు తక్షణమే తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఆర్.ఏం రాజు, డివిఏం భూపతి రెడ్డి, కోరుట్ల డీఎం, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.