కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల పట్టణ సోమవంశ సహసర్జన క్షత్రియ సమాజ్ పట్టణ అధ్యక్షుడిగా దొండి నందనాల్, ప్రధాన కార్యదర్శిగా శికారి గోపి కృష్ణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రోజు ఎస్ఎస్కే భవన్ లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలో పీఎస్టీ పదవులకు పోటిగా ఎవరులేనందున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారికి మాజీ అధ్యక్షుడు గంటేడి ప్రభాకర్, శికారి విజయ్, గంటేడి శ్రీనివాస్, జమాన్ జ్యోతి శ్రీనివాస్, బచ్చవాల సంజీవ్, బాదం పురుషోత్తం, చావ్ల లక్ష్మి నారాయణ, బచ్చవాల కిషన్, గంగామోహాన్ లు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.