ముద్ర, శేరిలింగంపల్లి :
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చెయ్యాలి తప్ప అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈరోజు మాదాపూర్ డివిజన్ ఉదయ క్రిసెంట్ గేటెడ్ కమ్యూనిటీ వాసులతో జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్, సీనియర్ సిటిజన్ ఫోరం కన్వీనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో భాజపా అధ్యక్షులు రాంచందర్ రావు మాట్లాడుతూ మీలాంటి చదువుకున్న ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి, సమాజంలో మార్పు కొరకు మీ సహకారం ఉండాలని, 12 ఏళ్ల క్రితం దేశం ఆర్థికంగా 12వ స్థానంలో ఉండగా ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నామని, 2014 లో మన ఎకనమి 106.57 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు 2025 నాటికి 331.03 లక్షల కోట్లనీ, ఎంత గొప్పగా దేశం అభివృధి చెందిందో ప్రతి ఒక్కరూ ఆలోచించి, మీ లాంటి వారు అందరికీ తెలియచేయాలని కోరారు, మోదీ దేశాన్ని చాలా శక్తి వంతమైన దేశం గా మార్చారు, మన సిద్ధాంతం ఎప్పుడూ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని, ప్రతి వర్గానికీ అభివృద్ధి, ప్రతి కుటుంబానికి భద్రత, ప్రతి యువకునికి అవకాశాలు అందించాలన్నదే మా లక్ష్యమని, డిజిటల్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, మేకిన్ ఇండియా, వికసిత్ భారత్ లక్ష్యంగా స్వదేశీ వస్తువుల తయారీ, నగరాల్లో మంచి త్రాగు నీరు అందించడానికి అమృత 2.0, పరిసరాల శుభ్రతకు స్వచ్ఛ భారత్ ఇలా అనేక కార్యక్రమాల ద్వారా దేశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ పథకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మీ లాంటి చదువుకున్న వారు వినియోగించుకుంటే దేశం చాలా వేగంగా ఒకటవ స్థానానికి వస్తుందని తెలిపారు, కమ్యూనిటీ వాసులు మెరుగైన రహదారులు, ట్రాఫిక్ సమస్య, సీనియర్ సిటిజన్ బిల్డింగ్ నిర్మాణం,మౌలిక వసతుల కల్పన ఇలా పలు సమస్యలు దృష్టికి తీసుకురాగా ఇవన్నీ ప్రభుత్వంతో మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు, అలాగే మీ అందరి సహకారాలు, సూచనలు, ఆశీర్వాదాలు ఉంటే మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు నవీన్, సభ్యులు రమణ రావు, ఉదయ్, వంశీ,తరుణ్, చంద్ర శేఖర్, కృష్ణయ్య,సూర్య తేజ,పూర్ణ చంద్ర రావు, శ్రీనివాస్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజిత్, ప్రొఫెషనల్ ఫోరం కన్వీనర్ బాల్దా అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, జితేందర్, ప్రధాన కార్యదర్శి శివ యాదవ్, నాయకులు శ్రీశైలం కురుమ, పవన్, రాజేశ్వర్ రెడ్డి, మహేందర్, బాలు నాయక్, యాదయ్య, ఆనంద్, కుర్మయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.