మహాదేవపూర్, ముద్ర:
జిల్లాలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సిఎస్‌ఆర్ నిధులు కేటాయించడం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మహాముత్తారం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌డిఎఫ్‌సి సిఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్మార్ట్ తరగతి గదులు, ఆధునికీకరించిన మరుగుదొడ్లు, ఎంఆర్‌సి భవనం మరియు చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆటపరికరాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, హెచ్‌డిఎఫ్‌సి జోనల్ మేనేజర్ రుణాకర్ రెడ్డి, వ్యవసాయ అధికారి బాబూరావు, పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. కుమారస్వామి, తహశీల్దార్ శ్రీనివాస రావు, ఎంపిడిఓ.ప్రకాష్, ఎంఈఓ రవీందర్ రెడ్డి, హెచ్‌డిఎఫ్‌సి ఏరియా మేనేజర్ సంపత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.