అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్
ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ
ఏప్రిల్ 16న మండల…. మే 2న నియోజకవర్గ…మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక
శాఖల వారీగా 10 వివిధ థీమ్ లతో 99 రోజుల కార్యక్రమం
ముద్ర, నారాయణ పేట :
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఫణిందర్ రెడ్డి వివరించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 6 నుండి జూన్ 12 వరకు జరిగే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈనెల 6 నుండి 15 వరకు అన్ని మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలలో శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలకు నిర్వహణపై కమిషనర్ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచ్ ,కౌన్సిలర్లు పాల్గొంటారని తెలిపారు.
ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ ఇదే నెల ఏప్రిల్ 16న మండల…. మే 2న నియోజకవర్గ…మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ ఉండాలన్నారు. మార్చి 6న ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ఉంటాయని 99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఫైల్స్ డిస్పోజల్ ఫైల్స్ క్లియరెన్స్ చేయాలన్నారు. మార్చ్ 16 నుండి 31 వరకు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలని జూన్ 2 వరకు ఇందిరమ్మ గృహప్రవేశాలు పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలో ఒక మోడల్ హౌస్ నిర్మించాలన్నారు. విద్యుత్ శాఖ వారు సోలార్ ఎనర్జీ కార్యాలయాలలో స్కూళ్లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్,అలైవ్ కార్యక్రమాలు ఏప్రిల్ 13 నుండి 18 వరకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీను, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.