Take a fresh look at your lifestyle.

తెలంగాణ రైతు సంఘం నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజ్ గౌడ్

 

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

తెలంగాణ రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా మూడవ మహాసభలు ఏప్రిల్ 6, 7 తేదీల్లో పోచంపల్లి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జయప్రదంగా జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా, ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్ లు పాల్గొని మహాసభల్లో ప్రసంగించారు.

రెండు రోజులపాటు జరిగిన ఈ మహాసభల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోరాటాలని సాధించిన విజయాలని చర్చించుకున్నారు. మహాసభలో జిల్లా వ్యాప్తంగా భవిష్యత్తులోనిర్వహించాల్సిన, సాగునీటి ప్రాజెక్టులై న బస్వాపురం ప్రాజెక్టు, రాచకొండ ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మూసి కాల్వలకు గోదావరి జలాలను లింకు చేసి పిల్లాయపల్లి, ధర్మారెడ్డి పల్లి అసిఫ్ నహర్, బొల్లేపల్లి కాల్వ, పునాది గాని కాల్వలకు గోదావరి జలాలను లింకు చేసి అందించాలని ఈ మహాసభల్లో తీర్మానాలని ఆమోదించారు.


అనంతరం మహాసభ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షులుగా మేక అశోక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాటూరి బాలరాజు గౌడ్, ఉపాధ్యక్షులుగా ఎండి జహంగీర్, బూరుగు కృష్ణారెడ్డి, చీరిక వేలు, కందాడి సత్తిరెడ్డి, సహాయ కార్యదర్శిగా కోట రామచంద్రారెడ్డి, దోడ యాదిరెడ్డి, గన్నె బోయిన విజయ భాస్కర్ పైళ్ళయాదిరెడ్డి, ఏదునూరి మల్లేశం తోపాటు జిల్లా కమిటీ సభ్యులుగా తుమ్మల నర్సిరెడ్డి, సూద గాని సత్య రాజయ్య, పిక్క గణేష్, బోయిని ఆనంద్, చీరిక సంజీవరెడ్డి, పొట్ట శ్రీనివాస్, ఆకుల ధర్మయ్య, ర్యాకల శ్రీశైలం ,బొమ్మ గాని శంకరయ్య, జిట్టా అంజిరెడ్డి, పగిళ్ల లింగారెడ్డి, గూడూరు బుచ్చిరెడ్డి, దడిపల్లి ప్రభాకర్, రేసు రామచంద్రారెడ్డి, మొగిలి పాక గోపాల్, సురకంటి శ్రీనివాస్ రెడ్డి, కొమ్ము మల్లేశం, పుష్పలత, చింతల రజిని, బందెల ఎల్లయ్య తుమ్మల సత్యనారాయణ రెడ్డి, కందుల మల్లారెడ్డి, పానుగుల్ల రమేష్, కొమ్ము అంజమ్మ 35 మందితో జిల్లా కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.