Take a fresh look at your lifestyle.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

 

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

 

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం గుండా వెళ్లే డోర్నకల్–గద్వాల నూతన రైల్వే లైన్‌కు ఆమోదం లభించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు మాట్లాడుతూ, సుమారు 296 కిలోమీటర్ల ఈ రైల్వే ప్రాజెక్టుకు దాదాపు రూ.5,500 కోట్ల వ్యయంతో ఫైనల్ లోకేషన్ సర్వే పూర్తి అయినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నారని వెల్లడించారు.

 

నాగర్ కర్నూల్ రైల్వేలైన్ సాధనాసమితి చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకుడు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లావాసుల దశాబ్దాల ‘రైలు కల’ సాకారం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని, ముఖ్యంగా మామిడి రైతులకు మార్కెట్ సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

అదేవిధంగా జాతీయ రహదారి అభివృద్ధి, సోమశిల వద్ద నిర్మాణంలో ఉన్న ఐకాన్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టులతో జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పంజుగుల నాగేందర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం. తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మోదీ చిత్రపటానికి పూలవర్షం కురిపిస్తూ పాలాభిషేకం నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.