Take a fresh look at your lifestyle.

కందుల డబ్బులు రూ. 10 కోట్లు విడుదల

బోథ్, ముద్ర:

రైతులు మార్క్ ఫెడ్ కు అమ్ముకున్న కంది పంటకు సంబంధించిన డబ్బులు విడుదల అయినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిది పసుల చంటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ
జిల్లా వ్యాప్తంగా మార్చి 17 వరకు కందులు కొనుగోలు చేయగా వాటికి సంబంధించిన డబ్బులు రూ. 10 కోట్లు విడుదల అయినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఫిబ్రవరి 27వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన 18,194 క్వింటాళ్ల కంది పంటకు సంబంధించిన డబ్బులు రూ.14.52 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే రూ. 3.5 కోట్ల డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, ఇందులో రూ. 2.50 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాలు జమ అయిన సంగతి తెలిసిందే అన్నారు. తాజాగా ఇప్పుడు మార్చి 17 వరకు కందులు అమ్ముకున్న రైతుల డబ్బులు 10 కోట్లు వారి ఖాతాల్లో జమకానున్నట్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.