Take a fresh look at your lifestyle.

ఘనంగా ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ కార్యక్రమం

 

 

కోరుట్ల, ముద్ర 

కథలాపూర్ మండలం పొతారం గ్రామం లో స్థానిక పీఎం శ్రీ ఎంపీపీఎస్  ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజు ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు హర్యానా సాంస్కృతిక నృత్యాలు, పాటలు వచ్చిన అతిథులను ఆకట్టుకున్నాయి. అలాగే తెలంగాణ, హర్యానా సంస్కృతులను ప్రతిబింబించే ఆహార పదార్థాలు, వేషధారణ, నృత్యాలు పండుగలు చారిత్రక కట్టడాలు ముఖ్యమైన ప్రముఖుల యొక్క అంశాలు పిల్లలచే ప్రదర్శించబడ్డాయి. కార్యక్రమాలను అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థుల్లో చిన్నతనం నుండే  భిన్నత్వంలో ఏకత్వం పై  అవగాహన కల్పించేందుకు, సంప్రదాయాలను గౌరవిస్తూ విద్యార్థులలో ఐక్యత భావాన్ని పెంపొందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి లొకిని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం అభినందనీయమని కొనియాడారు. పిల్లలు చేసిన నృత్యాలు వేషధారణ వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందనీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే చిన్నారులకు ఉచితంగా దుస్తులు అల్పాహారం భోజనాలు పుస్తకాలు అందిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెంచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇలాంటి విభిన్నమైన కార్యక్రమాలు పిల్లల్లో  పాఠశాల పట్ల ఇష్టాన్ని పెంచుతాయని తెలిపారు. పాఠశాలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పాల్గొన్న విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులుగా అందించడం జరిగింది. ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించిన పాఠశాల సిబ్బందిని గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, స్వప్న జలంధర్, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ పులి శిరీష హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.