Take a fresh look at your lifestyle.

ఓపెన్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి -అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లాలో పదవ, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 పరీక్షలు నిరాణించాలన్నారు. జిల్లాలో 1035 మంది పదవ, 821 ఇంటర్, మొత్తం1856 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని తెలిపారు. 5 ఎస్ఎస్సి, 4 ఇంటర్ చొప్పున మొత్తం 9 పరీక్ష కేంద్రాలలో ఓపెన్ పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు వసతులు ఉండాలన్నారు. తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందితో కూడిన అత్యవసర వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన అత్యవసర మందులు, ఓఆర్ఎస్ పొట్లాలు అందుబాటులో ఉంచాలన్నారు. దూర ప్రాంత విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అవసరమైకు ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. ఈ సమావేశంలో డిఈఓ భోజన్న, డిఐఈఓ పరుశురాం, తపాలా శాఖ ఇన్స్ పెక్టర్, ఎసిజిఈ పరమేశ్వర్, ఆర్టీసీ, వైద్య శాఖల అధికారులు రమేష్, సౌమ్య, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.